ETV Bharat / state

Police help: మూడు నిండు ప్రాణాలను కాపాడిన పోలీసులు!

author img

By

Published : Mar 23, 2022, 12:11 PM IST

Police help: పోలీస్ డ్యూటీతోపాటు వైద్య సిబ్బంది విధులూ నిర్వహించి.. మానవత్వాన్ని చాటుకున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు. రోడ్డుప్రమాదంలో గాయపడి చావుతో పోరాడుతున్న ముగ్గురిని ప్రాణాపాయం నుంచి కాపాడి.. ఆస్పత్రికి తరలించారు.

police helps people met with accident at nellore
వైద్య సిబ్బందిగా మారిన పోలీసులు
వైద్య సిబ్బందిగా మారిన పోలీసులు

Police help: రోడ్డుప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రాణాలు పోశారు. నెల్లూరు జిల్లా నారంపేట వద్ద.. జాతీయ రహదారిపై కడప నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును.. లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. లారీ అడ్డంగా పడి పోయింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ వేణుగోపాల్ రెడ్డి సహా ఇతర సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

108 వాహనం వచ్చే వరకు వేచి చూడకుండా.. పోలీసు వాహనాలలోనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేవలం 3 నిమిషాల్లోనే ముగ్గురిని వైద్యశాలకు తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. కారులో ఇరుక్కున్న ఓ వ్యక్తిని జేసీబీల సాయంతో కాపాడి ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి:

Harassment: మేనమామ వేధింపులు.. తల్లి సహకారం.. తట్టుకోలేక వాళ్లు ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.