నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో భర్తను ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు విచారణలో తెలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆత్మకూరు సీఐ సోమయ్య వెల్లడించారు. దేపూరు గ్రామానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనపై గ్రామస్థుల ఫిర్యాదుతో ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. అందులో భాగంగా మృతుని భార్య వెంకట సుబ్బమ్మ.. ఆమె ప్రియుడు పెంచలయ్యతో కలిసి వెంకటేశ్వర్లును హత్య చేసినట్లు నిర్ధారించారు.
అసలేం జరిగింది..
కటారి వెంకటేశ్వర్లు-వెంకట సుబ్బమ్మ దంపతులు మేకలు కాస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు సోదరి భర్త పెంచలయ్యతో సుబ్బమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ తరుణంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన సుబ్బమ్మ.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం రూపొందించింది.
పథకం ప్రకారమే...
పశువుల మేతకు పొలానికి వెళ్లిన వెంకటేశ్వర్లును వెంబడించి మేత కోసం తెచ్చిన కత్తితో తలపై గాయపరచి హత్య చేశారు. అనంతరం గ్రామంలోనే తిరుగుతూ.. తన భర్త కనబడలేదంటూ బంధువులకు చెప్పింది. ఆచూకీ కోసం బంధువులు రెండు రోజులు గాలించగా వ్యవసాయ పొలంలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పిర్యాదుతో...
బంధువులు, గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటసుబ్బమ్మ, పెంచలయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా ఇద్దరూ కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సోమయ్య తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన ఆత్మకూరు ఎస్సైలు రవి నాయక్, సంతోష్ కుమార్ రెడ్డిని సీఐ అభినందించారు.
ఇదీ చూడండి: