Police Blood Donation Camps in AP : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వాహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన సైతం రక్తదానం చేశారు. పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. భేష్ అంటున్న జనం..
'అమరులైన పోలీసుల త్యాగాలు సంస్మరించుకుంటూ ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. స్వచ్ఛందంగా చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాము. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాం.' - అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ
Police Blood Donation Camps in Anantapur District : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందగా రక్తదానం చేశారు. పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరులను స్మరిస్తూ... కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో... రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన పలువురిని డీఎస్పీ అభినందించారు.
విద్యే కాదు.. సమాజ సేవ కూడా తెలుసు అంటున్న విద్యార్థులు
Police Blood Donation Camps in Rayadurgam : రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం అర్బన్ సీఐ లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
'అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్పది. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే అధిక సంఖ్యలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి దోహదపడేలా చేయాలి. పోలీసులతో పాటు ఇతరులు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ రక్తాన్ని దానం చేయడం సంతోషకరం.'-కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు
నూతన జంట వినూత్న నిర్ణయం.. పెళ్లి పందింట్లోనే రక్తదానం
Police Blood Donation Camps in Kalyanadurgam : ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు భారత స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడటానికి పోలీసులు రాత్రింబగళ్లు తమ భార్య పిల్లలను వదులుకొని విధులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని వారి సేవలు ప్రశంసనీయమని వెల్లడించారు.