నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర వైభవంగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని వేలాదిగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పొద్దుపోయాక అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనోత్సవం నిర్వహించిన అనంతరం జాతర ముగిసింది. రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, పార్లమెంటు సభ్యులు దుర్గాప్రసాదరావు పలువురు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక రాజవంశస్తులు సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు.
ఇది కూడా చదవండి