నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర మొదలైంది. రెండు రోజులపాటు నిర్వహించే జాతరలో బుధవారం కుమ్మరి ఇంటిలో పోలేరమ్మ విగ్రహం తయారీ సాగుతోంది. అర్ధరాత్రి దాటాక మెట్టినింటికి చేర్చి అమ్మవారి విగ్రహానికి రెండు కళ్ళను అమర్చుతారు. తెల్లవారుజామున గుడి వద్ద భక్తుల సందర్శనార్థం నెలకొల్పుతారు. గురువారం సాయంత్రం ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర ప్రతి ఏటా వినాయక చవితి తరువాత వచ్చే 3వ బుధ, గురువారాల్లో నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. భక్తుల కోసం ఆర్టీసీ జిల్లా నలుమూలల నుంచి 100 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. సుమారు 800 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. జాతరను విజయవంతం చేసేందుకు ఈవో శ్రీనివాసులురెడ్డి, ఆర్డీవో రాజశేఖర్ అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి