ETV Bharat / state

మహాత్ముడు నడయాడిన నేలకి 100 ఏళ్లు - Pinakini Satyagraha Gandhi Ashram in Pallipad

అది మహాత్ముడు నడియాడిన నేల. స్వాతంత్య్ర సమరయోధుల స్పర్శతో పులకించిన పుణ్యభూమి. సమర యోధుల్లో స్ఫూర్తిని రగిల్ఛి.. స్వేచ్ఛా కాంక్షకు ఊపిరులూదిన పురిటిగడ్డ. అదే నెల్లూరు జిల్లా పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం.. అడుగడుగునా బాపూజీ జ్ఞాపకాలతో మురిపిస్తూ.. నాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని, దీప్తిని ఎలుగెత్తి చాటుతోంది. ఈ ఆశ్రమం ఏర్పాటై వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..

Pinakini Satyagraha Gandhi Ashram in Pallipadu
పల్లిపాడులో పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం
author img

By

Published : Apr 11, 2021, 11:23 AM IST

Updated : Apr 11, 2021, 2:47 PM IST

పల్లిపాడులో పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం

మహాత్ముడు గాంధీజీ తిరిగిన నేల అది. ఆ నెల్లూరు జిల్లా పల్లిపాడుకు చెందిన ఆశ్రమం స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ప్రధాన కేంద్రంగా ఉండేది. 1921 ఏప్రిల్‌ 7న గాంధీజీ స్వయంగా ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. క్విట్‌ ఇండియా ఉద్యమాలకు అప్పట్లో వేదికైంది. అంతేకాదు రాట్నం చప్పుళ్లు.. ఖద్దరు కళ.. గీతా పారాయణం తదితరాలతో మార్మోగింది. అంతటి చరిత్ర ఉన్న ఈ ఆశ్రమం 2021 ఏప్రిల్‌ 7 వ తేదీకీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్‌ కవరును విడుదల చేసింది. దీని ద్వారా నాటి స్వరాజ్య పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేసినట్లయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు..

సర్వమత ప్రార్థనలు

పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ.. అప్పటి చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వీటిని చూసి తన్మయత్వం పొందుతారు. నేటికీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి...

డీ అడిక్షన్ కేంద్రం

ఈ ఆశ్రమం మొత్తం 18ఎకరాల స్థలంలో ఏర్పాటైంది. పక్కనే గలగల పారుతున్న పెన్నానది, పచ్చటి పైర్లు, చుట్టూ చెట్లు, చల్లటి వాతావరణంలో పల్లెపాడు ఆశ్రమం ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో డీ అడిక్షన్ కేంద్రం ఉంది. ఇక్కడ విశాలమైన రోడ్లు, పర్యాటకులకు విశ్రాంతి భవనం, ఓపెన్ ఎయిర్ స్టేడియం, గాంధీజీ డిజిటల్ మ్యూజియం, ఫుడ్ కోర్టు, గ్రంథాలయం నిర్మించారు. ఆశ్రమ ప్రవేశంలో గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణలో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమ బాధ్యతలను రెడ్‌క్రాస్‌ సంస్థ నిర్వహిస్తోంది..

పల్లెపాడు గాంధీ దేవాలయం

బడి పిల్లలు ఈ గాంధీ ఆశ్రమానికి ఎంతో ఇష్టంగా వస్తుంటారు. దీనిని పల్లెపాడు గాంధీ దేవాలయంగా పిల్లలు పిలుస్తారు. రఘుపతి రాఘవ రాజారాం అని పాడుకుంటూ పరవసిస్తారు. పుస్తకంలో గాంధీ చరిత్రను ఉపాధ్యాయుడు వినిపిస్తుంటే ఎంతో ఆసక్తిగా అభ్యసిస్తారు..

శత వసంతాల ఉత్సవాలు

కొవిడ్ కారణంగా పినాకిని ఆశ్రమ శత వసంతాల ఉత్సవాలను నామమాత్రంగా నిర్వహించారు. ఈ ఏడాదిలో గాంధీ ఆశయాలను విస్తృతం చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు..

ఇదీ చూడండి. గ్రంథాలయానికి నిప్పు- 11వేల పుస్తకాలు దగ్ధం

Last Updated : Apr 11, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.