గూడూరు పట్టణంలోని అరుంధతివాడలో సురేష్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. గంజాయి విషయంలో ఘర్షణ జరగడంతో రమణయ్య అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తల్లి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్, రమణయ్య పలు కేసుల్లో అనుమానితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే రమణయ్యను పట్టుకొని హత్య కేసును ఛేదిస్తామని సీఐ దశరధ రామయ్య పేర్కొన్నారు.
ఇవీ చూడండి...