ETV Bharat / state

కాలనీ పేరు మార్చారని.. మంత్రి ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం - హరిజనకాలనీ పేరు మార్పుపై మహిమలూరులో మంత్రి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి నెల్లూరు పర్యటనలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. ఆత్మకూరు మండలం మహిమలూరులోని హరిజనవాడ కాలనీ పేరును.. సతీష్ రెడ్డి నగర్ అని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

mahimaluru person suicide attempt before minister mekapati
మహిమలూరులో మంత్రి ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jan 16, 2021, 9:13 PM IST

మహిమలూరులో మంత్రి ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి జరిగింది. హరిజనవాడ కాలనీని గుండ్రా సతీష్ రెడ్డి నగర్ అని మార్చగా.. దళితుల కాలనీకి ఆయన పేరు పెట్టడాన్ని మోరా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తప్పుపట్టాడు. మనస్థాపంతో మంత్రి కాన్వాయ్ ముందే పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు.

మంత్రి ఎదుటే ఇంత జరిగినా ఏమాత్రం పట్టనట్లుగా ఆయన కాన్వాయ్​లో వెళ్లిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోరా భాస్కర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండగా.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డితో పాటు డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలనలో...

ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. 30 కేంద్రాల ద్వారా 3 వేల టీకాలు అందిస్తున్నామని.. రోజురోజుకీ‌‌ పెంచుకుంటూ పోతామని తెలిపారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లాలో టీకా పంపిణీ.. సాంకేతిక కారణాలతో ఆలస్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.