నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మారు మూల మెట్ట ప్రాంతాలయిన బాట, సింగనపల్లి గ్రామాల్లో కోతులు వీర విహారం చేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి ఇష్టం వచ్చిన వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అడ్డం వచ్చిన వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. తాజాగా బాట గ్రామ సమీపంలోని పాఠశాలలో విద్యార్దులు ఆడుకుంటుడగా వారిపై దాడిచేశాయి. ఆరుగురు గాయపడ్డారు. వారిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలా ఇప్పటివరకూ రెండు గ్రామాల్లో 15 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నామని... అధికారులు స్పందించి కోతులను అరికట్టాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: