ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలకు నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం అధికారులు స్పందించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం పూట ప్రధాన బజార్లలో ప్రజల రద్దీ తగ్గించే చర్యలు చేపట్టారు. పట్టణంలో శుక్రవారం గుంపులు గుంపులుగా బజార్లలో ప్రజలు గుమిగూడిన వైనాన్ని ఈటీవీ, ఈటీవీ భారత్లో చూపించారు. స్పందించిన పురపాలక, పోలీస్ సిబ్బంది.. పట్టణంలోని సంచార పండ్ల వ్యాపారులను రోడ్లపై నుంచి పాత బస్టాండ్ సమీపంలోని మైదానానికి తరలించారు. చిరు వ్యాపారుల అమ్మకాలన్నీ అక్కడే చరిగేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా.. ప్రధాన బజార్లలో రద్దీ తక్కువైంది.
ఇదీ చదవండి: