నెల్లూరు జిల్లాలో జోరుగా నామినేషన్లు...! - నెల్లూరు జిల్లాలో 582 ఎంపీటీసీ స్థానాలు
నెల్లూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో 46 జడ్పీ స్థానాలకు గాను..తొలిరోజు ఆరు మంది నామినేషన్ వేశారు. 582 ఎంపీటీసీ స్థానాలకు గాను 39 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది.