హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా నెల్లూరు నగరాన్ని సుందరంగా మార్చారు. ఐదు నెలలుగా నగరపాలక సంస్థ అధికారుల కృషితో నగరం చుట్టూ పచ్చదనం పరుచుకుంది. కానీ.. 2 నెలలుగా లాక్డౌన్లో.... కరోనా జాగ్రత్తల్లో భాగంగా మొక్కలకు నీరు పట్టేవారు లేకపోయారు. కొన్ని చోట్ల మొక్కుబడిగా నీరు పట్టినా.. అది ఏమాత్రం సరిపోక వేలాది మొక్కలు ఎండిపోతున్నాయి.
పొదలకూరు రోడ్డు, కేవీఆర్ పెట్రోలు బంక్, గాంధీ బొమ్మ సెంటర్, హరనాథపురం, చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో.. నీరు లేక రహదారి విభాగినుల మధ్యలో ఉన్న మొక్కలు మాడిపోయాయి. ఫలితంగా.. పచ్చదనం కనుమరుగవుతోంది. నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికైనా మొక్కలకు నీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: