ETV Bharat / state

NGT: నెల్లూరు కెమికల్‌ కంపెనీపై అధ్యయనానికి 'కమిటీ'..ఎన్జీటీ ఆదేశం!

author img

By

Published : Jun 5, 2021, 7:31 AM IST

నెల్లూరు జిల్లా చంద్రపడియలోని రసాయన కర్మాగారం నుంచి పర్యావరణానికి కలుగుతున్న హానిపై...అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(NGT) సంయుక్త నిపుణుల కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.

NGT
NGT

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియలోని వెంకట నారాయణ యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న హానిపై...అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(NGT).. సంయుక్త నిపుణుల కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. పొగాకు నుంచి నూనె తీసే కర్మాగారాన్ని బల్క్‌ డ్రగ్‌ కర్మాగారంగా మార్చడమే కాకుండా వ్యవసాయ బావుల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నారని...వేమూరు భాస్కర్​రావు అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ఎన్జీటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌, జస్టిస్‌ సుధీర్ అగర్వాల్‌, జస్టిస్‌ ఎం. సత్యనారాయణన్‌, జస్టిస్‌ బ్రిజేశ్‌ సేథి, విషయ నిపుణుడు డాక్టర్‌ నగిన్‌ నందాలతో కూడిన ధర్మాసనం..ప్రత్యేకంగా సంయుక్త నిపుణుల కమిటీ నియమిస్తూ...మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి, రాష్ట్ర కర్మాగారాల ముఖ్య ఇన్‌స్పెక్టర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, నెల్లూరు జిల్లా కలెక్టర్లను కమిటీ సభ్యులుగా నియమించింది. కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యంతో స్థానికంగా జల వనరులు, వాయు నాణ్యతపై చూపుతున్న ప్రభావంపై అధ్యయనం చేసి...నివేదిక ఇవ్వాలని సంయుక్త నిపుణుల కమిటీకి ఆదేశాలచ్చింది.

ఇదే కర్మాగారంలో మే 11న గ్యాస్‌ లీక్‌ కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కూడా విచారించాలని సూచించింది. ఆ రోజు.. పర్యావరణానికి కలిగిన హాని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, కర్మాగారం రసాయన, పర్యావరణ నిబంధనలు పాటిస్తుందా లేదా తదితర అంశాలపై కూడా సవివరమైన నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. వెంకట నారాయణ ఇంగ్రీడియంట్స్​పై గతంలో కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. నిపుణుల కమిటీ తన నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను అక్టోబరు పదో తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:పోలవరం బిల్లులు వెనక్కి...ఎడమ కుడి కాలువలకు చెల్లింపులకు ఇక చెల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.