ETV Bharat / state

ఉప ఎన్నికలో వాలంటీర్లకు చెక్​ పెట్టేందుకు పార్టీల వ్యూహస్త్రాలు

తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటాలని విపక్షాలు కసరత్తులు చేస్తున్నాయి. 'పేజ్ ప్రముఖ్' అంటూ ఉత్తరాది సక్సెస్ ఫుల్ ఫార్మూలాను తొలిసారి దక్షిణాదిలో కమలదళం ప్రయోగిస్తుండగా.. సేవ్ తిరుపతి అనే నినాదాన్ని భుజాలకెత్తుకున్న తెలుగు దేశం.. డిజిటల్ వేదిక ద్వారా ప్రజల పక్షాన నిలబడేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇలా పార్టీలు సరికొత్త అస్త్రాలతో గెలుపుకోసం హోరాహోరీగా కార్యాచరణతో ముందుకెళుతున్నాయి.

tirupathi bypoles
తిరుపతి ఎన్నికల్లో వాలంటీర్లకు చెక్​ పెట్టేందుకు పార్టీల కొత్త అస్త్రాలు
author img

By

Published : Apr 2, 2021, 4:03 AM IST

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ.. వాలంటీర్ల ద్వారా గెలుపు పాచిక పారకూడదని నిర్ణయించుకున్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. విభిన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాలంటీర్ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు పథకాలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే కాషాయ దళం భాజపా.. పేజ్ ప్రముఖ్ వ్యూహాన్ని తిరుపతి ప్రజలకు పరిచయం చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం తెదేపా మాత్రం వెబ్ సైట్, మిస్డ్ కాల్స్ ద్వారా సమస్యల్లో ఉన్న ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.

ఐటీ సెల్​తో వచ్చిన తెదేపా..

ఎవరైనా వాలంటీర్ ఇంటికి వచ్చి బెదిరిస్తే ఫోటోలు తీయండి. అధికార పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు రానివ్వం అంటే సెల్ ఫోన్​లో చిత్రీకరించండి. ఆ వివరాలు 7557557744 ఫోన్​ నంబర్​కి పంపిస్తే చాలు.. మీకు పదివేల రూపాయలిస్తాం" ఇవీ మూడు రోజుల క్రితం తిరుపతిలో తెదేపా 40 వసంతాల ఆవిర్భావ దినోత్సవం రోజున తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న మాటలు.

సేవ్ తిరుపతి పేరిట..

అంతేకాదు.. ఆధ్యాత్మిక నగరి తిరుపతి కేంద్రంగా జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలను రాష్ట్ర ప్రజలకు తెలియచేసేలా..వారికి అండగా ఉండేలా ఓ ప్లాట్ ఫాం ను తెలుగుదేశం పార్టీ డిజిటల్ వింగ్ ఐటీడీపీ రూపొందించింది. సేవ్ తిరుపతి పేరుతో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సైట్​లో ప్రజలెవరైనా సరే తమ సమస్యను ప్రస్తావిస్తూ ఉద్యమంలో చేరటం ద్వారా.. అధికార పార్టీ చేస్తున్న దారుణాలను... ప్రత్యేకించి వాలంటీర్ వ్యవస్థ వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఈసీ దృష్టికి తీసుకెళ్లేలా తెదేపా వ్యూహ రచన చేసింది.

'పేజ్ ప్రముఖ్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చిన భాజపా'

మరోవైపు భాజపా సైతం వాలంటీర్ వ్యవస్థకు చెక్ పెట్టేలా.. ఓ ఉత్తరాది వ్యూహాన్ని అమలు పరుస్తోంది. 50 ఇళ్లకు ఉండే ఓ వాలంటీర్ ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నాడని.. అందుకు ప్రభుత్వ నిధులను వాడుకుంటున్నారనే విమర్శలు చేస్తున్న కమలనాథులు.. యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో విజయవంతమైన పేజ్ ప్రముఖ్ ఫార్మూలాను తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.

భాజపా అనుకూల ఓటరుతో..

ఇందుకు లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న 2వేల పైచిలుకు బూత్​లను.. శక్తి కేంద్రాలుగా విభజించుకుంది. ఒక్కో పోలింగ్ బూత్ లో ఉండే ఎలక్ట్రోరల్ రోల్స్ లో ప్రతీ పేజీకి ఓ భాజపా అనుకూల ఓటరు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ.. మిగిలిన వారితో ఓట్లు వేయించేలా చైతన్యపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది. తద్వారా వాలంటీర్ వ్యవస్థ కంటే క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసి.. ఎన్నికల్లో ఆధిక్యత సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చదవండి:

తిరుపతి ఉప ఎన్నిక: తెదేపా తరపున చినరాజప్ప, రామకృష్ణ ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.