ఉదయగిరి
ఉదయగిరి స్థానానికి పోటీచేస్తున్న వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో పూజలు చేశారు. వివిధ మతాలకు చెందిన ప్రార్థనమందిరాలకు వెళ్లారు. పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఎన్నికల అధికారికి పత్రాలను సమర్పించారు.
సూళ్లూరుపేట
సూళ్లూరుపేట వైకాపా అభ్యర్థిగా కే. సంజీవయ్య నామినేషన్ వేశారు. నాయుడుపేటలోని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారికి పత్రాలను సమర్పించారు. వరుసగా మూడురోజులు నామినేషన్ వేయటం ఆనవాయితీ కావటంతో.. ఈసారి ఆలాగే వేశారు. ముందుగా పట్టణంలోని శ్రీ విజయగణపతి ఆలయంలో కూర్చుని పత్రాలను నింపారు.
ఆత్మకూరు
ఆత్మకూరు భాజపా అభ్యర్థిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి నామినేషన్ వేశారు. సత్రం సెంటర్ నుంచి ర్యాలీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
తిరుపతి పార్లమెంట్
తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో.. ఎక్కువగా నెల్లూరు జిల్లాకు చెందినవే ఉన్నాయి. ఈ కారణంతో.. పనబాక లక్ష్మి నెల్లూరులోని డీఆర్డీఏ కార్యాలయంలో పత్రాలను సమర్పించారు. భర్త కృష్ణయ్య ఆమె వెంట వెళ్లారు. గూడూరు అసెంబ్లీ అభ్యర్థి పాశం సునీల్, సూళ్లూరుపేట అభ్యర్థి పరసారత్నం, పార్టీనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఇది కూడా చదవండి.