MPDO Audio leak On OTS: వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతంగా డబ్బు లాగుతున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఓటీఎస్ డబ్బు కట్టకపోతే సంక్షేమ పథకాలు నిలివేస్తామని స్థానిక అధికారులు, వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
వారి ఆరోపణలను నిజం చేస్తూ.. తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ టార్గెట్లను నిర్దేశిస్తూ.. గ్రామ కార్యదర్శుల, వీర్వోలకు, డిజిటల్ అసిస్టెంట్లకు హుకుం జారీ చేశారు. ప్రతి సచివాలయంలో రోజుకు కనీసం పది చొప్పున ఓటీఎస్లు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఓటీఎస్ కట్టని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలపై సంతకాలు పెట్టొద్దని అధికారులను ఆదేశించారంటూ.. ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఆడియో లీక్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్.. వివరణ కోరుతూ మర్రిపాడు ఎంపీడీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇదీ చదవండి
chandra babu comments on cm jagan: 'ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోంది'