నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ చక్రధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని స్థానికులు కలెక్టరుకు ఫిర్యాదు చేయటంతో ఆయన ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలుగు గంగ నీటిని చెరువులకు వచ్చేలా చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కడగుంట వద్ద ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు వసతులు కల్పించకపోవడం పట్ల స్థానిక అధికారులను ప్రశ్నించారు. ఉపాధి నిధులతో శాశ్వత పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇవీ చదవండి..