నెల్లూరులోని నక్కా గోపాల్ నగర్ కాలనీవాసులు మూడు రోజులుగా అధికారుల కార్యాలయాల వద్ద నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇళ్లు కూల్చి వేయడంతో రోడ్డున పడ్డామని.. రోడ్లమీదనే అన్నం తింటూ స్నానాలు చేస్తున్నట్లు వాపోతున్నారు. నిన్న రాత్రి కూడా కలెక్టరేట్ ఆవరణలోనే గడ్డకట్టే చలిలో వణుకుతూ నిద్రపోయారు.
80 కుటుంబాలకు న్యాయం చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సైతం స్పందించడం లేదని మండిపడుతున్నారు. స్థలాలు ఇచ్చి.. ఇల్లు కట్టించి ఇచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:
Migratory Birds Dead: పెలికాన్ పక్షులకు ఏమైంది..! మృత్యువాతకు కారణం ఏంటి?