ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందని... ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని జనసేన ప్రధాన నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఎల్సీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 12న జరిగే బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇతర ప్రముఖులు రానుండటంతో సభా వేదికను ఆయన పరిశీలించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా.. భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ప్రమాణం అనగానే పులివెందుల పిల్లి తోక ముడిచింది: అయ్యన్నపాత్రుడు