Mounika Family Murder Case Update in Kavali : నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో జరిగిన ముగ్గురి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈనెల6న మౌనిక అనే వివాహితతో పాటు ఆమె తండ్రి కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మలు దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిని పూర్తి వివరాలను కావలి డీఎస్పీ ఎం.వెంకటరమణ శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో కేసు, నిందితుల అరెస్టు వివరాలను తెలిపారు.
Three People Murder in Same Family in Nellore District : కొండబిట్రగుంటకు చెందిన రైల్వే ఉద్యోగి మందాటి మధుసూదన్‌కు తొమ్మిది సంవత్సరాల క్రితం బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన మౌనికతో వివాహం అయింది. వీరికి ఆరు సంవత్సరాల కుమారుడు మన్విత్ చంద్ర కూడా ఉన్నాడు. ప్రతిరోజు భర్త మద్యం తాగి వచ్చి మౌనికను మానసికంగా, శారీరకంగా హింసించే వారిని తెలిపారు. అలాగే మౌనిక మామ ప్రవర్తన కూడా సరిగా ఉండేది కాదని, దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్తు ఉండేవారని తెలిపారు. ఆపై బతిమలాడుకుని తిరిగి బిట్రగుంటకు భర్త తీసుకువస్తుండేవాడని... ఒక రోజు ఆమె పట్ల మామ మాల్యాద్రి అసభ్యంగా ప్రవర్తించటంతో బిట్రగుంటలోనే వేరే ఇంటిలో అద్దెకు నివాసం ఉన్నారని, వారు ఉంటున్న నివాసం వద్దకు వచ్చి కూడా మామ మాల్యాద్రితోపాటు అత్త ధనమ్మ, మరిది మౌళిచంద్ర తీవ్ర స్థాయిలో హింసించే వారని డీఎస్పీ తెలిపారు.
Woman, Her Dad Grandmother Killed for Property : ఈ తరుణంలో ఆమె చెన్నై నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా చేరారని డీఎస్పీ ఎం.వెంకట రమణ తెలిపారు. మౌనిక తల్లి వద్ద ఉన్న చిన్నారి మన్విత్ చంద్రను బలవంతంగా అత్తమామలు తీసుకెళ్లడంతో బుచ్చి పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టినట్లు గుర్తు చేశారు. మరో వైపున భర్త ఎక్కువగా మద్యం తాగి శారీరకంగా ఊబకాయ సమస్యతో బాధపడుతుండే వారని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో చికిత్స పొందుతూ గత నెల 28వ తేదీన చనిపోయారు. భర్త అంత్యక్రియలకు మౌనిక, ఆమె తండ్రి కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ వచ్చారు. ఈ నెల 9వ తేదీన కర్మ క్రియలు పూర్తి అయ్యేంత వరకు బిట్రగుంటలోని వారింటిలో ఉండాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆస్తిలో వాటా, కారుణ్య నియామకం ద్వారా రైల్వే ఉద్యోగం నిమిత్తమే వారు తమ ఇంటిలో ఉంటున్నారని మౌనిక అత్తింటి కుటుంబం భావించింది.
Three people killed in Nellore district: నెల్లూరు జిల్లాలో ముగ్గురి ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు
ఈ హత్యలో ఎవరెవరి హస్తం ఉంది?: ఎలాగైనా వారిని అంతమొందించేందుకు పథకం రచించారు. అనుకున్నట్లుగానే రాత్రి నిద్రపోతున్న సమయంలో అతి కిరాతకంగా వారిని హత్య చేశారు మౌనిక అత్తింటి కుటుంబం. వారిని హత్య చేసేందుకు నిందితులు వినియోగించిన రెండు ఇనుప రాడ్లు, ఓ కట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ కేసులో నిందితులైన మౌనిక మామ మందాటి మాల్యాద్రి, అత్త ధనమ్మ, మరిది మౌళిచంద్ర న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరవ్వాలని ప్రయత్నిస్తుండగా.. బుడంగుంట వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసును చేధించడంలో ప్రతిభ చూపిన గ్రామీణ సీఐ మురళిరాజేశ్, బిట్రగుంట ఎస్సై శేఖర్‌బాబులను డీఎస్పీ ఎం.వెంకటరమణ ప్రశంసించారు.
Murder in Eluru District: ఏలూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు