నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన సుధీర్... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కోల్పోయాడు. మెరుగైన వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో... కుటుంబ సభ్యులు ఐక్య ఫౌండేషన్‌ను ఆశ్రయించారు. స్పందించిన సంస్థ వ్యవస్థాపకుడు పయ్యావుల రామకృష్ణ చౌదరి... దాతల సహాయంతో రూ.36,500 అందించారు.
ఈ కార్యక్రమానికి ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ అజాద్ జాకీర్, ఎంపీడీవో రాఘవేంద్ర పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి ఐక్య ఫౌండేషన్ అండగా నిలుస్తోందని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ జాకీర్ అన్నారు. సుధీర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎంపీడీఓ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: