సినిమావాళ్లకు ఆంధ్రప్రదేశ్ గుర్తుందా? అని.. నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించి.. సామాన్యుడు కూడా పెద్ద సినిమాలు చూసేలా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సినిమా వాళ్లకు.. చంద్రబాబునాయుడి సపోర్ట్ ఉందని విమర్శించారు.
ఇదీ చదవండి:
Ramgopal Varma: నా అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చా: రామ్‌గోపాల్ వర్మ