ETV Bharat / state

కోట్ల విలువైన భూమిపై ఎమ్మెల్యే కన్ను.. కంచె వేసి..

MLA Occupied government land: నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ స్థలంలో వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రె‌డ్డి కంచె వేశారు. తన గెస్ట్‌హౌస్‌కు ఆనుకుని ఉన్న అర ఎకరా స్థలాన్ని వైఎస్సార్‌ విగ్రహ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలం చుట్టూ ఇప్పుడు కంచె వేయటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Mekapati Chandrasekhar Reddy
వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రె‌డ్డి
author img

By

Published : Dec 4, 2022, 5:03 PM IST

Updated : Dec 4, 2022, 8:12 PM IST

MLA Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన వారి పై చర్యలు తీసుకుంటాము జేసి కూర్మనాథ్ తెలిపారు. జాతీయ రహదారిపై సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మెకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన గెస్ట్ హౌస్​కు ఆనుకొని ఉన్న స్థలాన్నికి ఇనుప కంచె వేశారు. ఆ స్థలంలో జగన్ పాదయాత్ర సమయంలో వైఎస్ఆర్ విగ్రహం కోసం ప్రభుత్వం సెంటు స్దలం కేటాయించింది. మిగతా స్థలం ఖాళీగా ఉండగా.. ఆ మెుత్తం స్థలానికి కంచె వెయటం‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మర్రిపాడు పర్యటనకు వచ్చిన జేసీ కూర్మనాథ్​ని స్థలం అక్రమణపై వివరణ కోరగా.. ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలానికి కంచె వేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే మర్రిపాడులో 2003లో కొంతమంది నిరుపేదలకు స్థలాలు కేటాయించిందని.. ఆ స్థలాలను సైతం కొంతమంది వైకాపా నాయకులు రికార్డులు తారుమారు చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. రికార్డులు తారుమారు చేసిన ఆధికారితో పాటుగా.. రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారును ఆదేశించినట్లు జేసి వెల్లడించారు.

జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ స్థలానికి కంచె వేసిన ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.