ధాన్యం కొనుగోలులో అక్రమాలంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో భారీగా అక్రమాలు జరిగాయంటూ పదే పదే చెప్పటాన్ని తీవ్రంగా ఖండించారు. నాడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి... మిల్లర్ల వద్ద కోట్లాది రూపాయలను దండుకున్నారని ఆరోపించారు.
అవినీతిలో మునిగితేలిన సొమిరెడ్డికి డాక్టరేట్ ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడలేదని ఇద్దరం ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: