మత్స్య శాఖను అభివృద్ధి చేసేందుకు 3200 కోట్ల రూపాయల వ్యయంతో... 8 జిల్లాలో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను... కేంద్ర, రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్నిమత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను.. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు.
మద్దూరుపాడు వద్ద ఏర్పాటు చేయనున్న చేపల ప్రాసెసింగ్ యూనిట్‌ను మంత్రులు పరిశీలించారు. అనంతరం బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామ సమీపంలో ఫిషింగ్ హార్బర్‌ను చూశారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు మత్స్యకార రంగ అభివృద్ధి ఉపాధి పెంపు లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రెండున్నర సంవత్సరాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: