నెల్లూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రులు సమావేశమయ్యారు. పార్టీ పటిష్టత, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరుపై మంత్రులు.. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో మంత్రి అనిల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
పలు కారణాల రీత్యా మంత్రి గౌతమ్‌రెడ్డితో పాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సమావేశానికి హాజరుకాలేకపోయారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై నేతలు చర్చించారు. పథకాల అమలు తీరును మంత్రులు తెలుసుకున్నారు.