నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. రొట్టెల పండుగకు గత ఏడాదితో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యతతో కూడిన పనులు చేశామని మంత్రి తెలిపారు. అనంతరం స్వర్ణాల చెరువు పరిశీలించి ఆయన అధికారులకు కొన్ని సూచనలు చేశారు. పారిశుద్ధ్యంతో పాటు చెరువులో నీళ్ళు పరిశుభ్రంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పాపం కావ్య.. ఎవరైనా ఆదుకోండయ్యా..!!