నెల్లూరులోని హరనాథపురం, ముత్తుకూరు రోడ్డు, స్టోన్ హౌస్ పేట, విజయ మహల్ గేట్ ప్రాంతాల్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య, ఇరిగేషన్ కాలువలను పరిశీలించారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముత్తుకూరు రోడ్డు ప్రాంతంలోని వీధి వ్యాపారుల కోసం కార్పొరేషన్ ద్వారా దుకాణాలు నిర్మించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు.
ఇవీ చదవండి: