రాష్ట్రంలో నిర్వీర్యం అవుతున్న 108, 104 వ్యవస్థలకు పునరుజ్జీవం పోసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. జిల్లాకు వచ్చిన వాహనాలకు మంత్రి నెల్లూరులో ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 108 వాహనాలను ప్రభుత్వం పటిష్ఠం చేసిందన్నారు. అత్యాధునిక సదుపాయాలతో అత్యవసర సేవలకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
వీటికి అవసరమైన సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాకు 69 వాహనాలు వచ్చాయని.. మరో 20 వాహనాలు నెలరోజుల్లోపు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సమర్థ పాలన అందిస్తూ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిన సీఎం జగన్.. రానున్న రోజుల్లో మొదటి స్థానం సంపాదిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి...
అచ్చెన్న అరెస్టు ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం: తెదేపా నేతలు