చెన్నైకి ఉపాధి కోసం వెళ్లిన బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వలస కార్మికులు... తిరిగి వారి సొంత రాష్ట్రాల బాట పట్టారు. ప్రతి రోజు వందల మంది వలస కూలీలు నెల్లూరు జిల్లా గూడూరు జాతీయరహదారిపై ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరం ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి లో రాత్రి పగలు పయనిస్తున్నారు.
ఎండను సైతం లెక్క చేయకుండా సరైన ఆహారం లేకుండా ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో దాతలు ఇచ్చిన ఆహారంతోనే కడుపు నింపుకొంటున్నారు. ప్రభుత్వం తమ ఇబ్బందులు గుర్తించి సొంత ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: