MIG LAYOUT: మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ పరిధిలో ప్రభుత్వం ఎంపిక చేసిన ఎంఐజీ లేఅవుట్ స్థలం.. అసని తుపాను ప్రభావంతో నీరు చేరింది. బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ (ఎంఐజీ లేఅవుట్) స్థలంలో భారీ ఎత్తున నీరు నిలిచింది. ఇక్కడి ఉప్పుచెరువు ప్రాంతంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు సమీపంలో సర్వే సంఖ్య 297లో సుమారు 26 ఎకరాల్లో 292 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. సదరు స్థలంలో మున్సిపల్ అధికారులు రెండు దఫాలుగా రూ.లక్షలు వెచ్చించి మట్టి తోలి చదును చేశారు. అయినా ప్రస్తుతం 3 అడుగుల లోతు వరకు నీరు నిలిచి చెరువును తలపిస్తోంది.
ఇవీ చదవండి: రాష్ట్రంలో తగ్గుతున్న చిన్నారుల సంఖ్య ... ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్న జంటలు