ETV Bharat / state

YCP Gadapa Gadapaku: '30 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క రోడ్డు వేయలేకపోయారు..' - YCP Gadapa Gadapaku

'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైకాపా నేతలకు నిరసనల ఎదురవుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను వారి ఎదుట ఏకరువు పెడతున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్న మాచనూరు పర్యటనలో ఓ సామాన్యుడు అడిగిన ప్రశ్నకు మేకపాటి కుటుంబం ఖంగు తిన్నది. మరో వైపు సర్పంచ్​పై స్థానిక మహిళలు అగ్రహం వ్యక్తం చేశారు.

YCP Gadapa Gadapaku
YCP Gadapa Gadapaku
author img

By

Published : May 21, 2022, 6:15 PM IST

'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్న మాచనూరులో ఆత్మకూరు వైకాపా ఇన్​ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైకాపా నేతలకు నిరసనల సెగ తగిలింది. సామాన్యుడు అడిగిన ప్రశ్నకు మేకపాటి కుటుంబం ఖంగు తిన్నది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుని కంచుకోటలా ఏర్పాటు చేసుకుని 30 ఏళ్లుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందుతున్న మేకపాటి కుటుంబాన్ని ఓ సామాన్యుడు వేసిన ప్రశ్న అయోమయంలో పడేసింది.

'మేకపాటి కుటుంబం 30 ఏళ్లుగా అధికారంలో ఉంటున్నా.. మా గ్రామానికి ఒక్కటంటే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా రాలేదు. వర్షం వస్తే మా తిప్పలు అన్నీ ఇన్నీ కావు' అని అడిగిన ప్రశ్నకు వైకాపా నేతలు బిత్తరపోయారు. ఇదిలా ఉంటే.. గ్రామంలో పలువురు మహిళలు..' మా ఇంటికి రావద్దు. మేము ఓట్లు వేయం.. మీరు అడగొద్దు' అంటూ నిరసన తెలుపుతూ చుట్టుముట్టారు. 'మా సర్పంచ్ మాకు ఏమీ చేయలేదు. అసలు అందుబాటులోనే ఉండరు. అధికారులు, నాయకులు వచ్చినప్పుడు మాత్రమే కనబడుతున్నారు' అని అగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.