నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, ప్రైడ్ లయన్స్ క్లబ్ చేయూత అందించాయి. దాదాపు 450 మంది కార్మికులకు 20 రోజులకు సరిపడా నిత్యావసరాలు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. హాస్పిటల్స్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సునంద చేతుల మీదుగా వీటిని అందించారు. ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని.. గ్రామస్థులు వారిని ఊర్లోకి రానివ్వడం లేదని.. అయినా నిరుత్సాహపడకుండా సేవలందిస్తున్నారని కొనియాడారు.
ఇవీ చదవండి: