ETV Bharat / city

అంబులెన్సులో ప్రాణాలొదిలిన మహిళ!

author img

By

Published : Apr 11, 2020, 7:30 AM IST

కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన మహిళ తెలంగాణలోని గాంధీ ఆసుపత్రికి వెళ్తూ అంబులెన్సులోనే మృతిచెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను చూసేందుకు వచ్చిన కుమారుడు ఎవర్ని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారనే విషయంపై వైద్యఆరోగ్య శాఖ ఆరాతీస్తోంది.

అంబులెన్సులో ప్రాణాలొదిలిన మహిళ!
అంబులెన్సులో ప్రాణాలొదిలిన మహిళ!

కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన మహిళ (55) గాంధీ ఆసుపత్రికి వెళ్తూ అంబులెన్సులోనే మృతిచెందడం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఓ మహిళ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో పోలీసుల అనుమతితో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈనెల 1న ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కుమారుడు వచ్చి చూసివెళ్లేవాడు. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించటంతో వైద్యులు నమూనాలు సేకరించి ఈనెల 8న గాంధీ ఆసుపత్రికి పంపారు. పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించి శుక్రవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి పంపారు. వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఆమె కుమారుడు ఎవర్ని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారనే విషయంపై వైద్యఆరోగ్య శాఖ ఆరాతీస్తోంది. అతను, అతని కుంటుంబసభ్యులతో పాటు ఆ పరిసర ప్రాంతాలను క్వారంటైన్‌లో ఉంచే దిశగా అధికారులు సమాయమత్తమవుతున్నారు. ఆమెకు వైద్య సేవలు అందించిన కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యులు, నర్సులను క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

ఇదీ చూడండి: 'ఆ వృద్ధుడు కరోనాతో చనిపోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.