మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాములను ఖాళీగా ఉంచకూడదనే ఉద్దేశ్యంతో... నెల్లూరులో ఉన్న గిడ్డంగులను అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు రామమ్మ తెలిపారు. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పారు.
ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు గోదాములను అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇది వరకు గిడ్డంగులను ప్రభుత్వ అనుబంధ శాఖలకు మాత్రేమే అద్దెకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆన్లైన్ ద్వారా నిర్వహించే టెండర్ల ద్వారా గోదాములు అద్దెకు తీసుకోవచ్చని తెలియజేశారు. వ్యాపారులు, మిల్లర్లు, రైతులు కూడా ఇందులో పాల్గొనవచ్చన్నారు.
ఇవీ చదవండి:
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ఒకరు మృతి, నలుగురికి గాయాలు