న్యాయం కోసం ఉద్యమం
యువతి మృతికి కారకులైన వారిపై అట్రాసిటీ, అత్యాచారం కేసు నమోదు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. కేసు నమోదుకు నిరాకరించిన ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అలా జరగకపోతే దళిత వర్గాలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. యువతి మృతదేహానికి రీ-పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు బయటపెట్టాలన్నారు.
నిందితుడికి అధికార పక్షం అండ..!
దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు.. సీఎం జగన్ హేట్సాప్ చెప్పడం కాదన్న మందకృష్ణ మాదిగ... రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలన్నారు. దళితులపై దాడులకు పాల్పడినవారికి శిక్షలు పడకుండా అధికారపక్షం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం అందించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. యువతి మృతి ఘటనపై న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఇదీ చదవండి :