భార్యాభర్తల గొడవ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. అంతటితో ఆగక, ప్రాణాలు పోయేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు..కొండూరు గ్రామానికి చెందిన కామిరెడ్డి, సుదర్శనమ్మ దంపతుల మద్య ఇటీవల తగదాలు చోటుచేసుకున్నాయి. ఇవి కాస్తా, కుటుంబ గొడవలకు దారి తీసాయి. దీంతో సుదర్శనమ్మ, తన భర్తపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కామిరెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు,తమదైన శైలిలో విచారించారు. దీనిని అవమానంగా భావించిన కామిరెడ్డి, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పోలీస్ స్టేషన్ లోనే తాగాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కామిరెడ్డిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది. రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్న కామిరెడ్డి ఇవాళా మృతి చెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కామిరెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్ళి ధర్నాకు దిగారు. ఈ ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో..పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు శవాన్ని తీసుకెల్లేది లేదని..బంధువులు భీష్మించడంతో..ఉన్నతాధికార్లు రంగంలోకి దిగారు. డీఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో, మృతదేహాన్ని అక్కడ్నుంచి తరలించారు.
ఇదీ చదవండి :