నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు పంచాయతీ జాతీయ రహదారి వద్ద పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో రహదారి పక్కన ఉండే గృహంలోకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది. సుమారు రూ.30లక్షల ఇల్లు ధ్వంసమైంది. ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులు బయట పడ్డారు. తిరుపతి నుంచి నెల్లూరు జిల్లా కృష్ణ పట్టణం వెళుతున్న లారీ అతి వేగంతో రోడ్డుకు దూరంగా ఉన్న ఇంట్లోకి చొచ్చుకెళ్లింది. ఆరుగురు కుటుంబ సభ్యులు భవనంపై నిద్ర పోతున్నారు. రాత్రి వేళ లారీ ఢీకొనడంతో అక్కడున్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళు చేరుకుని వారిని బయటకు తీసుకొచ్చారు. భారీ నష్టం జరిగింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ... దూరం తరుగుతుంటే.. గారం పెరుగుతుంటే...