కరోనా విజృంభిస్తున్న వేళ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు కష్టతరంగా మారుతోంది. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడిలోని భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్రమ కార్యాలయం వద్ద అధికారులను అడ్డుకుని నిరసన చేపట్టారు. అనంతరం తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆశ్రమ ప్రాంగణం చుట్టూ నివాసాలు ఉన్నాయని, ఇక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ అధికారులను ప్రశ్నించారు. ఈ మేరకు ఆశ్రమ ఈవో బాలసుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తుల అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి
'గొలగమూడిలో క్వారంటైన్ కేంద్రం వద్దు' - గొలగమూడిలో క్వారంటైన్ కేంద్రం వార్తలు
నెల్లూరు జిల్లాలోని గొలగమూడిలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును స్థానికులు వ్యతిరేకించారు. నివాస ప్రాంతాల వద్ద క్వారంటైన్ ఏర్పాటు చేయొద్దంటూ నిరసన తెలిపారు.
!['గొలగమూడిలో క్వారంటైన్ కేంద్రం వద్దు' Quarantine Center in the golagamudi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6942660-292-6942660-1587848199608.jpg?imwidth=3840)