నెల్లూరులో అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న ఇద్దరిని నవాబుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10.72 లక్షల రూపాయల విలువైన గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి రొయ్యల వాహనాల్లో గుట్కాలను అక్రమంగా నెల్లూరు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నెల్లూరులోని ప్రశాంత్ నగర్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న కోళ్లఫారంలో ఈ గుట్కాను నిల్వ చేసి, దుకాణదారులకు విక్రయిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిషేధిత గుట్కాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి : జీవో 203తో విద్వేషాలు పెంచుతున్నారు: చంద్రబాబు