నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో... కోయంబేడు ప్రభావంతో వరుసగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దిల్లీ నుంచి పట్టణానికి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకొని రెడ్ జోన్‌గా ప్రకటించారు. తర్వాత ఆ పేషంట్ డిశార్జ్ కావడంతో ఆరెంజ్ జోన్‌గా ప్రకటించారు.
తాజాగా వారం వ్యవధిలో కోయంబేడు మార్కెట్‌తో సంబంధాలు కలిగిన... కోతరుము వీధి, మిట్టపాలెం ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకగా.. పట్టణ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారులు అప్రమత్తమై వీరి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. వీరు ఎవరెవరిని కలిశారన్నది గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి దుకాణాలు మూసివేయించారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: