మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని నెల్లూరు నగర మాజీ ఛైర్మన్, తెదేపా నేత శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని దొరతోపు గుంట సమీపంలోని పెన్నా పొర్లు కట్ట ఆక్రమించి అక్రమ లే అవుట్లు వేసి అవినీతికి పాల్పడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
అనిల్ కుమార్ యాదవ్ బినామీలు వారికి ఇష్టం వచ్చినట్లు లే అవుట్లు వేసి రూ. కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అధికారులు వెంటనే లేఅవుట్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
ఇవీ చూడండి