రాష్ట్రంలోని 10,110 రైతు భరోసా కేంద్రాలను కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానాలకు అనుసంధానం చేస్తున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో నెలసరి రైతు ఆదాయం రూ.6,400 మాత్రమే ఉన్నదని... ఈ ఆదాయం పెరగాలంటే రైతుల్లో చైతన్యం రావాలన్నారు. తెలంగాణలో 75శాతం ఆంధ్రప్రదేశ్ వరి విత్తన రకాలు వాడుతున్నారని ఉపకులపతి తెలిపారు. అందులో 50 శాతం 1010 రకం, 28 శాతం బీపీటీ 5204 రకం సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచంలో అగ్రస్థానంలో మన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 36 సంవత్సరాల నుంచి బీపీటీ 5204 రకానికి మంచి పేరు ఉంది. నూతనంగా బీపీటీ 2595 అనే రకం అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో 36 రైతు భరోసా కేంద్రాల్లో మూలం విత్తనోత్పత్తి కార్యక్రమం చేపడుతున్నాం. ఇకనుంచి రైతులకు గ్రామాల్లోనే విత్తనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. - విష్ణువర్ధన్ రెడ్డి , ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం ఉపకులపతి
రైతులు సాగు విధానములో జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలియజేశారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి