వరుసగా దొంగతనాలు చేస్తున్న దొంగలను, నకిలీ పోలీసులు అనిచెప్పి మోసాలకు పాల్పడుతున్న దుండగులను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. జలదంకి మండలంలోని చామదల గ్రామానికి చెందిన పసుపులేటి గోపి ,పసుపులేటి జ్యోతి మహేష్ ,పసుపులేటి తిరుమల, బోగోలు మండలంలోని సుందరగిరి వారి కండ్రిక గ్రామంలో పావన చెంచురామిరెడ్డి అనే వ్యక్తి బైక్ ఆపి బెదిరించారు. దీంతో బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. బిట్రగుంట పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతేగాక పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బోగోలు మండలం కోవూరుపల్లి గ్రామానికి చెందిన బోచ్చు డేవిడ్, బచ్చు దుర్గయ్య అలియాస్ దుర్గ ప్రసాద్, గౌరవరం గ్రామ సమీపంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19,500లు స్వాధీనం చేసుకున్నారు. పలు నేరాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు పట్టుకోవడంతో డీఎస్పీ వారిని అభినందించారు.
ఇదీచూడండి.ఒక్కో బిల్లుపై 2, 3 ట్రిప్పులు.. 8 'మైనింగ్' లారీలు సీజ్