ప్రభుత్వ తీరును, ప్రజాప్రతినిధుల అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, దాడులకు పాల్పడుతున్నారని నెల్లూరులో జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
గిద్దలూరులో రోడ్డుకు మరమ్మతుల గురించి నిలదీసిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు... అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని... ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీ కే బహిరంగంగా హెచ్చరికలు చేస్తుంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులను నియంత్రించకుంటే, ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: