నెల్లూరులో కుంగిపోయిన పెన్నా వారధి బ్రిడ్జిని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన నగరంలో పర్యటించారు. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి రూ. 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ప్రకటించారు.రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో 800కోట్లు, పోలవరం కుడి కాలువలో 58కోట్లు, వెలుగొండ ప్రాజెక్టులో 80కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లకపోతే, ఈ సోమ్మంతా కొందరి జేబుల్లోకి వెళ్లి ఉండేదని అనిల్ విమర్శించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో వర్షం.. ట్రాఫిక్కు అంతరాయం