ETV Bharat / state

వినూత్న ఆహ్వాన పత్రిక... అతిథులకు గుర్తుండిపోయేలా..! - వెడ్డింగ్ క్యాలెండర్

కొన్ని రోజుల్లో వారి కుమారుడి పెళ్లి. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు ఆహ్వాన పత్రికలు అందజేయాలనుకున్నారు. అయితే అతిథులకు ఉపయోగపడేలా వెడ్డింగ్ కార్డులను చేయించాలనుకున్నారు. వినూత్నంగా పంచాంగాన్ని ఆహ్వానపత్రికలా మార్చేశారు.

innovative wedding card  with new year calendar
వెడ్డింగ్ క్యాలెండర్
author img

By

Published : Jan 2, 2020, 8:20 PM IST

వినూత్న ఆహ్వాన పత్రిక... అతిథులకు గుర్తుండిపోయేలా!

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామానికి చెందిన కామిరెడ్డి కేశవరెడ్డి, సుమతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సాయిమురళీ కృష్ణారెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతనికి ఫిబ్రవరి నెలలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే వివాహ ఆహ్వాన పత్రిక వినూత్నంగా ఉండాలని అతని కుటుంబసభ్యులు భావించారు. అతిథులకు ఏడాదిపాటు ఉపయోగపడేలా నూతన సంవత్సరం క్యాలెండర్​ను ఆహ్వాన పత్రిక రూపంలో తయారు చేయించారు. వధూవరుల చిత్రాలతో క్యాలెండర్‌ రూపొందించి పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వచ్చే నెలలో నెల్లూరులో పెళ్లి నిర్వహించనుండగా ఇప్పటినుంచే బంధువులకు క్యాలెండర్‌ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.

ఇదీ చదవండి:నౌహీరాషేక్​ను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు

Intro:పర్యావరణ పరిరక్షణ. ప్రత్యేకత కోసం. ప్రతిఒక్కరికీ ఉపయోగకరమైన రీతిలో. ఖర్చు తక్కువ ఎక్కువ ప్రయోజనం ఉండేలా కల్యాణ పత్రికలు కొత్త ఏడాది క్యాలెండర్ తో కలిపి తయారు చేయించారు. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటున్నారు. వినూత్నంగా పెళ్లి పత్రికలు 2020 ఏడాది క్యాలెండర్ లో అన్ని వివరాలు ఉండేలా ముద్రించి ప్రజలకు పంచి పెళ్లికి ఆహ్వనం పలుకుతున్నారు. పెళ్లి పత్రిక తీసుకున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఏడాదంతా ఉపయోగపడేలా కల్యాణ క్యాలెండర్ ను ఆ కుటుంబ సభ్యులు ప్రజలకు పంచుతున్నారు.

Body:నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామంలో నివాసం ఉంటున్న కామిరెడ్డి కేశవరెడ్డి సుమతి దంపతులకు ఇద్దరు కుమారులు.పెద్ద కొడుకు సాయిమురళీ కృష్ణా రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు ఫిబ్రవరి నెలలో వివాహం చేసేలా పెద్దలు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు పెళ్లి పత్రిక తయారీ లో ప్రత్యేకత ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. నూతన సంవత్సరం ఏడాది క్యాలెండర్ తో ముద్రించి బంధువులు స్నేహితులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు చుట్టు పక్కల వాళ్లకు పత్రికలు పంపిణీ చేస్తున్నారు. మనం చేసే ప్రతిపని ప్రజలకు ఉపయోగపడాలని ఇలా చేశామని కుటుంబ సభ్యులు అంటున్నారు. బైట్స్ 1.కేశవరెడ్డి.2.సుమతి 3.మహీంద్ర నోట్.సొర్ అమర్ గారి సూచన మేరకు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.