ETV Bharat / state

'మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తి'

నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో అవినీతి తప్ప... రాష్ట్రాభివృద్ధికి జరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.

minister mekapati gowtham reddy speech
మేకపాటి గౌతమ్​రెడ్డి
author img

By

Published : Dec 25, 2019, 6:57 PM IST

'మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తి'

సోమశిల హైలెవల్ కెనాల్ ప్రాజెక్టు పనులను మూడేళ్లలోపు పూర్తి చేస్తామని... మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి వివరించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఆయన పర్యటించారు. నందవరంలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. సీఎం జగన్​మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు.

గ్రామ సచివాలయాల ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని మంత్రి చెప్పారు. అధికారుల చుట్టూ తిరగకుండా సచివాలయంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. తెదేపా ప్రభుత్వం అప్పులు మిగిల్చింది తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. సోమశిల హైలెవల్ కెనాల్ ద్వారా మెట్టప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:దమ్ముంటే కేబినెట్ భేటీ అమరావతిలో పెట్టండి: దేవినేని ఉమ

Intro:Ap_nlr_12_25_mantri paryatana_av_ap10061Body:యాంకర్ వాయిస్: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పర్యటించారు. మండలంలోని నందవరం లో సచివాలయంకు శంకుస్థాపన చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ప్రజలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్ మోహన్ రెడ్డి తో సాధ్యమని అందులో భాగంగా గ్రామం నుంచే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ సచివాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. సచివాలయంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత టిడిపి ప్రభుత్వం పోతూ పోతూ వేలకోట్ల రూపాయలు అప్పులు మిగిల్చిందని, అభివృద్ధి మాత్రం జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిని మరచి పచ్చ తమ్ముళ్లకు దోచి పెట్టడంలోనే సమయం సరిపోయిందని, ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. స్వ స్థలం మెట్ట ప్రాంతం కావడంతో తాగు, సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని అన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ ద్వారా సమస్య పరిష్కారానికి అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చాశామని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.