నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 8 కోట్ల వ్యయంతో రోడ్లు, కాలువలు, కల్వర్టు పనులకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆటోనగర్ అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.
ప్రస్తుతం రూ. 8 కోట్లతో పనులు ఆటోనగర్ సగం భాగానికే సరిపోతుందన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరో రూ. 12 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఈ నిధులను వీలైనంత త్వరగా తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆటోనగర్ సమస్యల గురించి చెప్పిన వెంటనే పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారని కొనియాడారు.