కొన్ని రోజుల క్రితం వైద్యం వికటించి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ చేయూతనిచ్చింది. నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం గ్రామంలో ఆడ శిశువుకు జన్మనిచ్చి, వైద్యం వికటించడం వల్ల వెంకటమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ తరుపున 30 వేల రూపాయలు ఆర్ధిక సాయంతోపాటుగా బియ్యం, దుస్తులు అందజేశారు. చిన్నారి కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క దాతకు ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ ఛైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఆత్మకూరు అడ్వకేట్ ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతి నాయుడు, సహృదయ ఫౌండేషన్ ప్రతినిధి పెంచల్ రెడ్డి, స్వరూప్, రియాజ్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...